Breaking News

ఉప్పల్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ నష్టాలతో యువకుడి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/ ఉప్పల్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోడియం నైట్రేట్ విషం తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడు కాసోజు రవిచంద్ర (29). తండ్రి లేట్ మనోహర్. స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మారుతి నగర్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్‌లో కిరాయికి నివాసం ఉంటున్నాడు. గత ఐదేళ్లుగా ఆన్‌లైన్ లాంగ్‌టర్మ్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న రవిచంద్రకు ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం సుమారు 4.30 గంటల సమయంలో ఆన్‌లైన్ ద్వారా తెచ్చుకున్న సోడియం నైట్రేట్‌ను సేవించిన రవిచంద్ర, తనకు అస్వస్థతగా ఉందని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే అతడిని ఉప్పల్‌లోని సిఎన్‌సి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆర్థిక సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మృతుడి తమ్ముడు నందకిషోర్ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..