Breaking News

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ కిన్నెర కోటేశ్వర్

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని కాంగ్రెస్ నాయకులు దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామానికి చెందిన ఎనిమిదవ వార్డు సభ్యులు గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ కిన్నెర కోటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజా పాలనకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అధికార పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ గెలుపు కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పని చేయాలని స్ధానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని పిలుపునిచ్చారు.