Breaking News

రెచ్చిపోతున్న దొంగలు.. కరెంటు మోటర్లు చోరీ

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం ఇప్పలపల్లి చింత రెడ్డి కరుణాకర్ రెడ్డి,అంబాలాపూర్ గుజ్జుల రమణారెడ్డి,పొలంపల్లి గుజ్జుల రమణారెడ్డి రైతులు కాకతీయ కెనాల్ కాల్వకు బిగించిన కరెంటు మోటార్లను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలలో,మండల పరిధిలోని గ్రామాలలో అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే 100కు సమాచారం అందించాలని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి