_ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్..
మన ప్రగతి న్యూస్ / రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి, ఐపీఎస్, సిరిసిల్ల జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈసమావేశంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు, పోలింగ్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల చట్టాలు మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పోలీస్ అధికారి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన నేరస్తులు, ఎన్నికల వేళ నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులు, పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు మరియు అనుమానితులను బైండోవర్ చేయాలని సూచించారు.రాష్ట్ర పోలీసు లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు పోలీసు అధికారులకు మున్సిపల్ ఎన్నికల నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు ఎన్నికల సమయంలో చట్టాల అమలు,నిబంధనల పాటింపు ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలను వివరంగా వివరిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ మహేష్ బి.గితే , హాజరై మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయిలో తీసుకుంటున్న చర్యల వివరాలను డీజీపీకి తెలియజేశారు.ఈ సమీక్షా సమావేశంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు కృష్ణ, వీరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్‌ఐలు కిరణ్, రామ్మోహన్, వినితా రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…
మున్సిపల్ ఎన్నికలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పకడ్బందీగా నిర్వహించాలి.._ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్..మన ప్రగతి న్యూస్ / రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి, ఐపీఎస్, సిరిసిల్ల జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈసమావేశంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు, పోలింగ్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల చట్టాలు మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పోలీస్ అధికారి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన నేరస్తులు, ఎన్నికల వేళ నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులు, పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు మరియు అనుమానితులను బైండోవర్ చేయాలని సూచించారు.రాష్ట్ర పోలీసు లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు పోలీసు అధికారులకు మున్సిపల్ ఎన్నికల నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు ఎన్నికల సమయంలో చట్టాల అమలు,నిబంధనల పాటింపు ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలను వివరంగా వివరిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ మహేష్ బి.గితే , హాజరై మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయిలో తీసుకుంటున్న చర్యల వివరాలను డీజీపీకి తెలియజేశారు.ఈ సమీక్షా సమావేశంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు కృష్ణ, వీరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్‌ఐలు కిరణ్, రామ్మోహన్, వినితా రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…


