మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : వర్ధన్నపేట పురపాలక సంఘం నందు రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 3తో నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల బరిలో 50 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. పురపాలక సంఘం పరిధిలో 12 వార్డుల గాను కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది, బిఆర్ఎస్ పార్టీ నుండి 12 మంది, భారతీయ జనతా పార్టీ నుండి 12 మంది, బీఎస్పీ పార్టీ నుండి ఒకరు, జె.ఎస్.పి పార్టీ నుండి ఒక్కరు, ఇతర రిజిస్టర్డ్ పార్టీల నుండి ఇద్దరు, పదిమంది ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిపి 50 మంది బరిలో ఉన్నారు.

