Breaking News

విధుల్లో చేరిన ఏఎస్ఐ పంపరి చంద్రశేఖర్

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ గా పంపరి చంద్ర శేఖర్ బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు.చందుర్తి పోలీస్ స్టేషన్ లో ఎ.ఎస్.ఐ గా పనిచేసిన పంపరి చంద్రశేఖర్ ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసిన పాషా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. గతంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన చంద్ర శేఖర్ అంచలంచలుగా పదోన్నతులు పొంది ఇదే పోలీస్ స్టేషన్ కు ఏ ఎస్ ఐ గా బదిలీ పై వచ్చారు.
కానిస్టేబుల్ నుండి ఏ ఎస్ ఐ వరకు విధులను సమర్థ వంతంగా నిర్వర్తించిన చంద్ర శేఖర్ పోలీస్ ఉన్నత అధికారుల మన్ననలను పొంది పోలీస్ శాఖ ద్వారా ప్రశంసలు పొందారు.

పల్లె ప్రకృతి వనం విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ అధికారులు మనప్రగతి న్యూస్ /నెక్కొండ : నెక్కొండ మండలంలోని సాయి రెడ్డి పల్లి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనంను ఆదివారం రోజు కొందరు వ్యక్తులు ఎవరికి తెలియకుండా పల్లె ప్రకృతి వనంలోని చెట్లను నరకడం జరిగింది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరికిన వ్యక్తులను చట్టం ప్రకారం శిక్షించాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఈ సంఘటన జరగడానికి కారణం గ్రామ అధికారుల నిర్లక్ష్యమా.?లేక వారి ప్రమేయంతోనే జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది.