మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో సింగరేణి పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి, తగు వైద్య పరీక్షలు, చేసి, రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్ మరియు ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ, జైనొద్దీన్, చిప్పకుర్తి దుర్గయ్య, చిప్పకుర్తి వెంకన్న, ఆసంపెల్లి మల్లేష్, రాస కొండ రాజం, నల్లి శ్రీకాంత్, యువ నాయకులు చిప్పకుర్తి సతీష్ సోషల్ మీడియా ఆసంపెల్లి శివ, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

