Breaking News

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..

మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి:

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అం దించాలని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజ నాన్ని ఆయన పరిశీలించారు. అనంత రం విద్యార్థులతో కలిసి సర్పంచ్ వెంక టేష్ మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలన్నారు. భోజనం పై విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట ఉప సర్పంచ్ గోనె ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, పాఠశాల సిబ్బంది, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులున్నారు.

పల్లె ప్రకృతి వనం విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ అధికారులు మనప్రగతి న్యూస్ /నెక్కొండ : నెక్కొండ మండలంలోని సాయి రెడ్డి పల్లి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనంను ఆదివారం రోజు కొందరు వ్యక్తులు ఎవరికి తెలియకుండా పల్లె ప్రకృతి వనంలోని చెట్లను నరకడం జరిగింది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరికిన వ్యక్తులను చట్టం ప్రకారం శిక్షించాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఈ సంఘటన జరగడానికి కారణం గ్రామ అధికారుల నిర్లక్ష్యమా.?లేక వారి ప్రమేయంతోనే జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది.