మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి:
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు వికలాంగులు ఆసరా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. నెల రోజులు గడిచిన పెన్షన్ రాక పోవడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. నెల నెల అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఆసరా పెన్షన్ సమయానికి రాకపోవడంతో వృద్ధులకు, వికలాంగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. డిసెంబర్ నెలలో ఇవ్వవలసిన పెన్షన్ జనవరిలో ఇచ్చారు. జనవరిలో ఇవ్వవలసిన పెన్షన్ ఫిబ్రవరి 4వ తారీఖు అయినా కానీ పెన్షన్ ఇంతవరకు ఇవ్వడం లేదు. ఇలా అయితే ఒక నెల పెన్షన్ ఇవ్వరు కావచ్చు అని వృద్ధులు భయాందోళన చెందుతున్నారు. ఆసరా పెన్షన్ అవసరానికి ఆదుకుంటుంది అనుకుంటే అది కూడా అవసరం తీరేలా లేదని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ ను విడుదల చేసి నెల నెల ఇబ్బంది కాకుండా సమయానికి పెన్షన్ అందేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

