Breaking News

ఖాళీ మాటల కాలం ముగిసింది బి ఆర్ ఎస్ కాలం మొదలైంది

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ / కల్వకుర్తి:

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 2,3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సువర్ణ దేవేందర్ నాయక్,రాములు నాయక్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉదయం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. 2,3వ వార్డులో అభివృద్ధి కొనసాగాలంటే అనుభవం కలిగిన సువర్ణ దేవేందర్ నాయక్,రాములు నాయక్ గెలిపించాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు.బీఆర్ఎస్ విజయం ఖాయం ప్రచారంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు.ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.