మన ప్రగతి న్యూస్/ఏన్కూర్
ఏన్కూర్ మండల కేంద్రంలోని జన్నారం క్రాస్ రోడ్ వద్ద గురువారం ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు.రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల అమలు కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


