-మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి.
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:
కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.గురువారం చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్మా రెడ్డి మాట్లాడుతూ చొప్పదండికి వస్తుంటే ఆది శ్రీనివాస్ వేములవాడకు రావాలని ఆహ్వానించారు.ఇది విన్న కొందరు వేములవాడకు వెళ్లొద్దు అని చెవిలో చెప్పారు.వేములవాడకు వెళ్లిన తర్వాత పదవి పోతుంది.ఇలా ఇప్పటికే చాలా మందికి జరిగింది అన్నారు.ఇది విని నేను షాక్ అయ్యాను.తప్పకుండా వెళ్తా అది తప్పు అని నిరూపిస్తా గతంలో వేములవాడకు రూ.150 కోట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించి మోసం చేశారు.అలా మనం చేయలేదు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.150 కోట్లు మంజూరు చేశాం.బ్రహ్మాండంగా ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
శంకుస్థాపన వివరాలు రూ.45.15 కోట్లతో కరీంనగర్ జిల్లా రామడుగులో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన.రూ.5 కోట్లతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
-మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
మీ అందరి ఆశీర్వాదం తో ఉత్తర తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాలో 13 కి 8 మంది శాసన సభ్యులను గెలిపించారు.గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా ,వైద్యం,ఇరిగేషన్ అన్ని రంగాల్లో జిల్లాను అనుభవజ్ఞులైన ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సారధ్యంలో జిల్లాను అగ్రగామిగా ఉంచే ప్రయత్నం లో అభివృద్ధి కార్యక్రమంలో శాసన సభ్యులు,మంత్రులం కలిసి వెళ్తున్నాం.నేరుగా పేద ప్రజల ఇళ్లకు వెళ్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న ప్రభుత్వం మీద అసహనంతో మాట్లాడుతున్న ప్రతిపక్షాలు చూస్తున్నాం.శాసనసభ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం తో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడింది.గత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చారు.ఉప ఎన్నికలు,సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రజా పాలన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీర్వదించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి.
ఉమ్మడి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.ప్రధాన మంత్రి స్వయంగా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మాట్లాడారు బీజేపీ నేతలు స్పందించలేదు.ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి, మంత్రులు ప్రధాన మంత్రి నీ బడ్జెట్ లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కలిసి విజ్ఞప్తి చేశాం..రెండు బడ్జెట్ లలో నిధులు కేటాయించలేదు.తెలంగాణ పై విషం చిమ్ముతున్న పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ పొత్తుపెట్టుకొనిపెట్టుకొని ప్రజల్లోకి వస్తుంది.తెలంగాణ కి నిధులు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారు.తెలంగాణ కల్లుపడితే ఆంధ్రా కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని విమర్శించారు.కొండగట్టు వస్తె ఉప ముఖ్యమంత్రి గా స్వాగతం పలికాం,తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్ష పూరితంగా మాట్లాడిన ఎవరు చూస్తూ ఊరుకోరు,అటువంటి వ్యక్తులతో పొత్తు పెట్టుకున్న తెలంగాణ బీజేపీ పై తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఆలోచన చేయాలి.11 నా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.


