మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్:
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం లోని చీకోడు గ్రామంలో ప్రతి గురువారం వారాంతపు సంత మరియు మేకల సంతను ప్రారంభించినట్లు సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు మాట్లాడుతూ చికోడు గ్రామంలో ప్రతి గురువారం వారాంతపు సంత అంగడిని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాల రైతులు మరియు చిరు వ్యాపారులు తమ కూరగాయలను నేరుగా చీకోడు గ్రామంలోని సంతలో విక్రయించుకొని లబ్ధి పొందాలని సూచించారు.. అదేవిధంగా వచ్చే వారం నుండి మేకల సంతను కూడా నిర్వహిస్తున్నామని మేకల మరియు గొర్రెలు విక్రయించేవారు నేరుగా మా గ్రామ సంతలో దళారులతో సంబంధం లేకుండా విక్రయించుకొని లబ్ధి పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు ఉపసర్పంచ్ ఆస రంజిత్,వార్డు మెంబర్లు మరియు తాజా,మాజీ ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


