మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారం జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో లో జరిగిన మండల స్థాయి సీఎం కప్ జూనియర్ వాలీబాల్ (విభాగం 18) విభాగం లో జడ్ పి హెచ్ ఎస్ ల్యాబర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉడుగుల సాయి కృష్ణ, పంకు రాకేష్ లు క్రీడా ప్రతిభ కనబరిచి వరంగల్ జిల్లా టీం కి ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు లింగం శైలజ, వ్యాయామ ఉపాధ్యాయులు జలగం రఘువీర్ లు తెలిపారు. వీరిని పలువురు గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించి ప్రశంసించారు.

