Breaking News

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమ్మడి నరసయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలుగ చెయ్యకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించే లాగా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐలు సాయిబాబా, రాజు, జఫర్గడ్ ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

లారీ బీభత్సం… మరో లారీని,బస్సును ఢీ

-ప్రయాణికులకు గాయాలు.

-యూరియా బస్తాలు డ్యామేజ్ .

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

దేశవ్యాప్త సమ్మెకు ఎంపీడీవో కు జిపి సిబ్బంది వినతి

కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో కరీంనగర్ నుండి తాడికల్ వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని కరీంపేట గ్రామానికి 232 బస్తాలతో యూరియా లోడ్ బయలుదేరింది.మార్గమధ్యలో తాడికల్ జాతీయ రహదారిపై అతివేగంతో నిర్లక్ష్యంగా ఇసుక లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది.ఆర్టీసీ బస్సులో దాదాపు 70 మందితో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురికి గాయాలయ్యాయి.మొదటగా ఢీ కొట్టిన లారీ లో యూరియా బస్తాలు చెల్లాచెదురుగా పడ్డాయి.దాదాపు పది యూరియా బస్తాలు పగిలిపోయినట్లు ఫ్యాక్స్ అధికారులు తెలిపారు.ఈ ఘటనలో ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు ఇసుక లారీ పాక్షికంగా దెబ్బతింది. యూరియా బస్తాలతో వస్తున్న లారీ నుజ్జు నుజ్జు అయింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు.