Breaking News

నర్మెట్టలో పెద్దపులి కలకలం

మన ప్రగతి న్యూస్ / నర్మెట్ట :

జనగామ జిల్లాలోని నర్మెట్ట మండలంలో పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజామున అమ్మపురం గ్రామ శివారులో పెద్దపులి దాడి చేసి రెండు దూడలను చంపివేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పెద్దపులి పాదముద్రలను సేకరించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పెద్దపులిని గుర్తించి బంధించేందుకు డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు