హైటెక్స్ గ్లోబల్ సోలార్ ఎక్స్‌పోలో ఒకేసారి 6 ప్రతిష్టాత్మక పురస్కారాల కైవసం
మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
సోలార్ ఎనర్జీ రంగంలో తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న నల్లబెల్లి నివాసి పెద్ది గణేష్ వరంగల్ కేంద్రంగా గల శ్రీ బాలాజీ సోలార్ ఎనర్జీస్ సంస్థ స్థాపించి మరోసారి తన సత్తా చాటింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఫిబ్రవరి 6, 7 తేదీలలో జరిగిన ‘గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో – 2026’ వేదికగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన’ కింద అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఈ సంస్థకు ఏకంగా 6 వార్షిక పురస్కారాలు లభించాయి.
అవార్డుల వివిధ జిల్లాలలో అత్యధిక సోలార్ ఇన్స్టాలేషన్లు పూర్తి చేసినందుకు గాను
వరంగల్ ,ములుగు జిల్లాలకు – డైమండ్ అవార్డులు
సిద్దిపేట జిల్లాకు – ప్లాటినం అవార్డు
జనగామ జిల్లాకు – గోల్డ్ అవార్డు కరీంనగర్ మంచిర్యాల జిల్లాలకు – సిల్వర్ అవార్డులను సంస్థ గెలుచుకుంది.
శుక్రవారం జరిగిన ఈ వేడుకలో శ్రీ బాలాజీ సోలార్ ఎనర్జీస్ డైరెక్టర్ సాగర్ రెడ్డి, టెక్నికల్ హెడ్ ఓదెలు, ప్రతినిధులు రాజేష్ రెడ్డి, అభిలాష్, తిరుపతి తదితరులు ఈ పురస్కారాలను అందుకున్నారు. 2011లో వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ పెద్ది గణేష్ రెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ఈ సంస్థ, నాణ్యమైన సేవల ద్వారా నేడు రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది.
₹78,000 సబ్సిడీతో 25 ఏళ్ల ఉచిత విద్యుత్:
ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ మాట్లాడుతూ.. “పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి వినియోగదారునికి ₹78,000 సబ్సిడీ అందుబాటులో ఉంది. నెలకు భారీగా కరెంటు బిల్లులు కట్టే బదులు, సులభ వాయిదాల పద్ధతిలో సోలార్ సిస్టమ్ అమర్చుకుని 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పొందవచ్చు” అని పేర్కొన్నారు.


