మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ కు సిఐటియు నాయకులు వినతి పత్రం అందించారు.వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని,విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ బిల్లు వంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడి, మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం,గ్రామపంచాయతీ మండల యూనియన్ అధ్యక్షులు ఎలుకపల్లి సారయ్య,సిఐటియు మండల కన్వీనర్ ఇమ్మడి చక్రపాణి,కార్యదర్శి కోహెడ సమ్మయయ్య,ఉపాధ్యక్షులు అలువాల జనార్ధన్,కిష్టయ్య,మేకల రమేష్, పోచయ్య పాల్గొన్నారు

