మన ప్రగతి న్యూస్/ వీణవంక:
వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో మొరం తరలిస్తుండగా ప్రమాదవశాత్తు డ్రైవర్ కు తీవ్ర గాయాలు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కనవేన కుమార్ 24( డ్రైవర్) కోర్కల్ గ్రామంలో మొరం తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 వాహనము సమాచారం ఇవ్వగా ఈఎంటి ఐలవేణి కుమారస్వామి పైలట్ చిలుమల దేవయ్య అత్య వసర చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. పరిస్థితి విషమించడంతో అక్కడ నుండి వెంటనే వరంగల్ కు తరలించడం జరిగిందని అన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

