మన ప్రగతి న్యూస్/గంభీరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోనీ మా అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్స గౌడ్ నేతృత్వంలో అశ్విని హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సత్యనారాయణ కుమారుడు డాక్టర్ అభినయ్ గోవర్ధన్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు ఉచిత మందులు పంపిణీ తో పాటు కింటల్ బియ్యం. అలాగే వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు మారుమూల ప్రాంతంలో ప్రజలకు అశ్విని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సత్యనారాయణ స్వామి తోపాటు వారి కుమారుడు అభినయ్ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ పెద్ద వైద్యానికి పట్టణాలకు వెళ్లకుండా పల్లె ప్రాంత ప్రజలకే సేవలందిస్తూ ప్రజల మన్నెనలు పొందుతున్నారు. వారు ప్రతి ఏటా నెలకు వృద్ధులకు 5000 అందిస్తూ వైద్య పరీక్షలతో పాటు మందులు ఉచితంగా సేవలు అందిస్తున్న సత్యనారాయణ అభినయ్ గార్లు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించాలని వృద్ధులు కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినయ్ గోవర్ధనం సింధు. వైద్య సిబ్బంది హరీష్ నవనీత్ బాబు సాగర్ సతీష్ శ్యామల వృద్ధాశ్రమ నిర్వాహకులు మాజీ జెడ్పిటిసి మల్లుగారి నర్సాగౌడ్. వృద్ధులు తదితరులు పాల్గొన్నారు

