Breaking News

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమ్మడి నరసయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలుగ చెయ్యకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించే లాగా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐలు సాయిబాబా, రాజు, జఫర్గడ్ ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతా

ప్రచారంలో మట్టా దయానంద్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి

మన ప్రతి న్యూస్/ఖమ్మం జిల్లా స్టాపర్:

రైతాంగానికి అండగా నిలిచిన కేసీఆర్ పాలనకు మద్దతు అవసరం

మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పలు వార్డులోని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. అభివృద్ధి ప్రదాత.డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో హనుమ తండా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ధరావత్ మోహన్ నాయక్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కస్టోడియ భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అప్పుడే 100% అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సాయంత్రం ఎన్.ఎస్.పి నందు నిర్వహించిన ప్రచారంలో స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇండ్లు కావడంతో శిధిలావస్థకు వచ్చాయని తమ కాలనీ వాసులకు ఇంటి సౌకర్యం కల్పించాలని,స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని, శుభకార్యాలకు సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు.శిథిల అవస్థలో ఉన్న కాలనీ ఇండ్లు ఎదుర్కొంటున్నామని వివరించగా వారి దీనగాధ విన్న తర్వాత అక్కడ పరిస్థితులను పరిశీలించి వెంటనే స్పందించి ఎరుకల కాలనీ మోడల్ కాలనీగా తీర్చిదిద్దే బాధ్యత మాదని అన్నారు. మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తక్షణం యుద్ధ ప్రాతిపదికన కల్లూరు పట్టణంలోని డ్రైనేజీ నిర్మాణాలు ప్రారంభిస్తామని అదేవిధంగా 15 కోట్లు నిధులు రెడీగా ఉన్నాయని మంత్రి పొంగులేటి కోటాలో 25 కోట్లు కేటాయించి ప్రతి వార్డుకు రెండు కోట్లు కేటాయించి అత్యాధునిక డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు. అక్కడ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఉన్నాడని ఇక్కడ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఉన్నారని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు.వార్డులో ఉన్న డ్రైనేజీ లని జాతీయ రహదారి పక్కన ఉన్న మెయిన్ డ్రైనేజీకి కనెక్ట్ చేస్తామని అన్నారు.అధికార పార్టీకి అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అమూల్యమైన ఓటును హస్తం ముద్ర పై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభివృద్ధి ప్రదాత డాక్టర్ మట్ట దయానంద్ విజయ్ కుమార్. రెవెన్యూ శాఖ మంత్రి సోదరులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అభ్యర్థించారు.