Breaking News

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమ్మడి నరసయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలుగ చెయ్యకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించే లాగా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐలు సాయిబాబా, రాజు, జఫర్గడ్ ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం..

_ అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి..

_ జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్..

మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల, జిల్లా స్టాపర్

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం చేసినట్లు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తి చేశామని తెలిపారు.

ప్రణాళిక ప్రకారం ముందుకు..

మున్సిపల్ ఎన్నికల కోడ్ విడుదల అయిన వెంటనే ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పక్కా ప్రణాళిక ప్రకారం..అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించి, పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేసేలా ప్లాన్ రూపొందించారు. సిరిసిల్ల, వేములవాడ లోని సినారె కళామందిరాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ అండ్ కౌంటింగ్ కేంద్రాల్లో ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. సిరిసిల్ల, వేములవాడలోని స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్టులను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పలుమార్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పీపీటీ ద్వారా శిక్షణ

ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అలాగే సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. సిరిసిల్ల, వేములవాడలోని మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. కావలసిన ఫారాలను అందుబాటులో ఉంచి ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించి.. దివ్యాంగులకు ర్యాంపు, అధికారులు, సిబ్బందికి కనీస వసతులు కల్పించేలా ఆదేశాలు ఇచ్చారు.

67 వార్డులు.. లక్ష 20వేలకు పైగా ఓటర్లు..

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 39 వార్డులు, వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. మొత్తం కలిసి 67 వార్డులు ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 117, వేములవాడ మున్సిపల్ పరిధిలో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 283 (సిరిసిల్ల 170, వేములవాడ 113) మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39,942 మంది పురుషులు, 42,011 మంది మహిళా ఓటర్లు, 06 ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లు 81,959 మంది ఉన్నారు. అలాగే వేములవాడ మున్సిపల్ పరిధిలో 19,580 మంది పురుషులు, 21,279 మంది మహిళా ఓటర్లు, 18 ఇతర ఓటర్లు ఉన్నారు.మొత్తం ఓటర్లు 40,877 మంది ఉన్నారు. .
రెండు మున్సిపాలిటీలో కలిపి 1,22,836 మొత్తం ఓటర్లు ఉన్నారు.

రైతాంగానికి అండగా నిలిచిన కేసీఆర్ పాలనకు మద్దతు అవసరం

ఎన్నికల అధికారులు..

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు 15, వేములవాడ మున్సిపల్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు 12 కలిపి మొత్తం 27 మందికాగా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 15, వేములవాడ మున్సిపల్ పరిధిలో 12 కలిపి మొత్తం 27 మందిని నియమించారు.

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కలిపి జోనల్ ఆఫీసర్స్ 21, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 4, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ లు 12 ఏర్పాటు చేశారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు 140, వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులను 70 మందిని నియమించారు. రెండు మున్సిపాలిటీలలో కలిపి ఏపీఓలు మొత్తం 210 మందిని నియమించారు. ఓపీఓలు మొత్తం 630 మందిని నియామకం చేసారు.

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది కలిపి 400, వేములవాడ మున్సిపల్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది కలిపి 300.. మొత్తం 700 మందిని నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.

ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా..

ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి .. ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కాకుండా ఈ కింద చూపిన ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఏఐ) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(RGI) జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డు (యూడీఐడీ)లు కలిగి ఉండాలి.

ఓటు హక్కు ను వినియోగించుకోవాలి

-ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలి. మున్సిపల్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.