Breaking News

11 వ వార్డులో బీజేపీ గెలుపు ఖాయం

బీజేపీ అభ్యర్థి మహేశ్వరి రాజారామ్

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని 11వ వార్డు లో బీజేపీ గెలుపు ఖాయం అని బిజెపి బలపరిచిన అభ్యర్థి మహేశ్వరి రాజారామ్ తెలిపారు. ఆదివారం 11 వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని దేశం గర్వించదగ్గ నాయకునికి బహుమతిగా ఈ వార్డును ఇవ్వాలని ఓటర్లను కోరారు. బీజేపీ వల్లే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రచారంలో భాగంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.