కాంగ్రెస్ హామీలు అమలుకాక ప్రజలు మోసపోయారు మాజీ ఎంపీ నామ
మన ప్రగతి న్యూస్ | ఏన్కూర్:
వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ప్రజలను కోరారు. ఆదివారం ఆయన చైర్‌పర్సన్ అభ్యర్థి కట్టా స్వరూపరాణి, వివిధ వార్డు అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్ సమస్యలు లేకుండా చేశామని తెలిపారు. రైతు బంధు, రైతు భీమా వంటి సంక్షేమ పథకాలు రైతాంగానికి భరోసాగా నిలిచాయని అన్నారు. తన ఎంపీ కాలంలో రోడ్ల అభివృద్ధితో పాటు గ్రామాల్లో పలు మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన, ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇప్పటికీ అమలుకాలేదని ఆరోపించారు. రైతులకు యూరియా కొరత ఏర్పడుతోందని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు నిరాశ చెందుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ పాలనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.


