మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి:
కేతన పెళ్లి మున్సిపాలిటీ 18 వార్డులో స్థానికంగా నివాసం ఉంటున్న వేముల స్వాతి హరి ప్రసాద్ దంపతులను బిజెపి గుర్తించి అవకాశం ఇచ్చినందున మున్సిపాలిటీ ఎలక్షన్ బరిలో నిల బడి ప్రచారం చేస్తుండగా ..సేవా భావాలు గల వారని ఊర కుక్కల దాడిలో గాయపడిన దూడను ప్రాణాలు కాపాడాలని ఫోన్ రావడంతో ప్రచారం పక్కన పెట్టి ఆ ప్రాంతానికి వెళ్లి అత్యవసర చికిత్స అవసరమని గుర్తించి పానుగంటి శ్రీనివాస్ గోపాలమిత్ర వారికి తెలప డంతొ హుటాహుటిన ఆ ప్రాంతా నికి వచ్చిన డాక్టర్ సహకారంతోని రెండు ఇంజక్షన్స్, ఒక సెలూన్ బాటిల్ ఎక్కించినా ప్రాణాలు కోల్పోయింది. మరణించిన ఆ దూడను భూమాత ఒడికి స్థానికు ల యొక్క సహకారంతోనే పూడ్చి పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు.

