Breaking News

ఆత్మకూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులకు, నాయకులకు పోలీస్ వారి హెచ్చరిక

నేటి సాయంత్రం 5:00 గంటలకు ముగియనున్న ఎన్నికల ప్రచారం.

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు

ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన సేవలకు వాట్సాప్ చాట్‌బోట్

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. ఇట్టి విషయాన్ని గమనించి మున్సిపాలిటీ 10 వార్డులలో పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు గాని వీరి అనుచరులు గాని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే అట్టి వారిపై కేసు నమోదు చేస్తామని, ఇతర ప్రాంతాల వారు సొంత ఊర్లకు వెళ్లవలసిందిగా పోలీసుల విజ్ఞప్తి. ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఎవ్వరు కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకూడదని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము అని సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.