- తహాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన దళిత విద్యావం తుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య..
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
భూపాలపల్లి జిల్లా రేగొండ మండ లంలో జరిగిన బాలిక అత్యాచారం కేసులో నిందితులైన వారిని కఠినం గా శిక్షించాలని నల్లబెల్లి మండల కేంద్రంలోని తహాసిల్దార్ ముప్పు కృష్ణ కు దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భం గా తెలంగాణ దళిత విద్యా వంతు ల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను గుర్తించి, చట్ట పరమైన కేసులు నమోదు చేయాలన్నారు. అదే విధంగా అత్యాచారాన్ని గురైన బాలిక కుటుంబానికి 10 లక్షలు ఎక్స్రేసియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ నిర్మించి, ఇవ్వాలని బాలిక కు వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించా లని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరా వృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని, సభ్య సమాజం తలదించుకునేలా శిక్ష పడాలని అన్నారు. ఈ ఘటన పై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పరికి రత్నం ,యువ నాయకులు ప్రకాష్, మేరు సంఘం మండల కార్యదర్శి ఓదెల రవి, జితేందర్, ప్రకాష్, రవీందర్, నరేష్ తదితరులున్నారు.

