Breaking News

భూదాన్ లో దద్దరిల్లిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజైన సోమవారం నాడు భూధాన్ పోచం పల్లిలో ఆయా పార్టీలు నిర్వహించిన ఎన్నికల ప్రచారం దద్దరిల్లింది. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున గత వారం రోజుల నుండి ఎన్నికల బరిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు గత వారం రోజు లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ప్రచార పర్వంలో ఆఖరి రోజైన సో మవారం నాడు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రచార ఉధృతిని పెంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైకుల హోరుతో దద్దరిల్లింది. బరిలో ఉ న్న అభ్యర్థులు తమ తమ గెలుపు కై తమ తమ వార్డులలో విస్తృతంగా నిర్వ హించిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన సేవలకు వాట్సాప్ చాట్‌బోట్