Breaking News

ప్రతి ఓటర్ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

  • వరంగల్ జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, వరంగల్ ఆర్డీఓ సుమా

మన ప్రగతి న్యూస్ / వర్దన్నపేట : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో అవగాహన పెంపొందించి, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకునేలా చైతన్యం కల్పించేందుకు సోమవారం వర్ధన్నపేట పట్టణంలో స్వీప్ (SVEEP) కార్యక్రమం, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, వరంగల్ ఆర్డీఓ సుమా పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా మొదటిసారి ఓటు వేయనున్న యువ ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్‌కు రావాలని ప్రోత్సహించారు.స్వీప్ కార్యక్రమం ద్వారా మునిసిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకుంటేనే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఏసీపీ నర్సయ్య, మునిసిపల్ కమిషనర్ సుధీర్ కుమార్, తహసీల్దార్ విజయ సాగర్ ఎంపిడిఓ వెంకట రమణ, మునిసిపల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది, స్వీప్ వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన సేవలకు వాట్సాప్ చాట్‌బోట్