-డివిజన్లలో చివరి రోజున అభ్యర్థులు జోరుగా ప్రచారం.
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:
కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది.పార్టీల అభ్యర్థులు ఆఖరి రోజు కావడంతో జోరుగా ప్రచారం నిర్వహించారు.పార్టీ నేతలు తగ్గేది లేదంటూ,ర్యాలీ చేసి ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మా పార్టీకి ఓటు వేయండి అంటూ ప్రచారం నిర్వహించారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న సాయంత్రం 5 వరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి.ఈ నెల11న పోలింగ్ ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది.13న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా మద్యం,కల్లు దుకాణాలు మూసివేయ నున్నారు.ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పార్టీల కీలక నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడిపారు.సమయం ముగియడంతో ఇక పోలింగ్ ముగిసే వరకు సభలు,ర్యాలీలు వంటివి నిర్వహించరాదని అధికారులు తెలిపారు.కరీంనగర్ లో 66 డివిజన్లకు గాను 398 మంది అభ్యర్థులు బరిలో దిగారు.ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతారో 11 తారీకు పోలింగ్ వరకు ఆగాల్సిందే.ఎన్నికల నేపథ్యంలో భాగంగా జిల్లా అధికారులు ఆయా పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బందిని,పోలీస్ సిబ్బందిని నియమించనున్నారు.పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి,మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.జిల్లా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ స్థానిక ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ లో జరగనుంది.జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసారు.అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

