Breaking News

మహా శివరాత్రి జాతరకు పకడ్బందీ పారిశుధ్య ఏర్పాట్లు

:వేములవాడను 20 జోన్లుగా విభజించి పకడ్బందీగా శుభ్రత పనులు నిర్వహించాలి

:ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలు

మన ప్రగతి న్యూస్/వేములవాడ

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..

మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంలో పారిశుధ్య పనులను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే మహా శివరాత్రి జాతరకు లక్షలాది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో, పట్టణం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.జాతర నిర్వహణలో భాగంగా వేములవాడ పట్టణాన్ని మొత్తం 20 జోన్లుగా విభజించి, ప్రతి జోన్కు ఒక పంచాయతీ కార్యదర్శిని ఇంచార్జిగా నియమించినట్లు తెలిపారు.ఆయా జోన్లలో పారిశుధ్య పనులు సమర్థవంతంగా జరిగేలా అవసరమైన సిబ్బంది, శానిటేషన్ పరికరాలు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెల 13 నుంచి 17 వరకు నిరంతరంగా పారిశుధ్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.పార్కింగ్ ప్రాంతాలు, జాతర నిర్వహణ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, భక్తులు సంచరించే ప్రాంతాల్లో ఎక్కడా చెత్తాచెదారం పేరుకుపోకుండా శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్య పనులు జాతర విజయవంతానికి కీలకమని పేర్కొంటూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో డీఆర్డీఓ గీత, డీపీఓ షరీఫుద్దిన్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.