Breaking News

దోమల నియంత్రణకు థర్మల్ ఫాగింగ్

ప్రజారోగ్యానికి ఏన్కూర్ గ్రామ పంచాయతీ ముందడుగు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..

ఏన్కూరు మండల కేంద్రంలో దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి థర్మల్ ఫాగింగ్ యంత్రం ద్వారా పొగ పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను అరికట్టాలనే ఉద్దేశంతో వీధివీధిగా ఫాగింగ్ చేపట్టినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధారావత్ కృష్ణ తెలిపారు.ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ చర్యలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమయానికి స్పందించి దోమల నివారణ చర్యలు చేపట్టడంలో ఏన్కూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ధారావత్ కృష్ణ ఆదర్శంగా నిలిచారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.