Breaking News

దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

30 తులాల వెండి ఆభరణాలు రికవరీ

మన ప్రగతి న్యూస్/వేములవాడ:

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ:
బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 30 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్ వెల్లడించారు.సి.ఐ వివరాల ప్రకారం వరదవెల్లి గ్రామానికి చెందిన కొంకటి తిరుపతి ఇంట్లో తేదీ ‘2’ శనివారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వెండి పూజా వస్తువులను దొంగిలించారు. ఈ ఘటనపై బాధితుడు బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, ఎస్.ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సంఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలు, సాంకేతిక సమాచారం ఆధారంగా నిందితులు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన కంచు శివ శంకర్ (20) మరియు సిరిసిల్ల సంజీవయ్య నగర్‌కు చెందిన, ప్రస్తుతం వేములవాడ సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న సామల్ల బాలకిషన్ (30)గా పోలీసులు గుర్తించారు.నిందితులను పట్టుకునేందుకు బోయినపల్లి ఎస్.ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోదురుపాక చౌరస్తా వద్ద బస్సు కోసం వేచి ఉన్న సమయంలో నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి దొంగతనానికి సంబంధించిన 30 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.ఈ కేసును త్వరితగతిన చేధించిన ఎస్.ఐ రమాకాంత్, ఫింగర్ ప్రింట్ ఎస్.ఐ క్రాంతి, అలాగే సిబ్బంది కోటి, లక్ష్మీనారాయణ, సుధాకర్, వెంకటేష్‌లను వేములవాడ రూరల్ సి.ఐ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.