_85 సంవత్సరాలు చరిత్ర కలిగిన కంపెనీ,
_ప్రపంచంలో 90 దేశాలలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగింపు
మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:
ములుగు మండలం వాగునూతి గ్రామంలో ఎన్ జా జాడెన్ ఇండియా కంపెనీ వారు మాధవరం కృష్ణరావు రైతు పొలంలో వారి సహకారంతో కంపెనీ లో ఉన్న అన్ని నూతన అధునాతనమైన రకాలను పండించి చుట్టు పక్కన ఉన్న రైతులకు వాటిని చూపించి వాటిపైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.కంపెనీ ఆసియా రీజనల్ డైరెక్టర్ సంజయ్ బిస్త్ కంపెనీ యొక్క ఆశయం కంపెనీ రైతుల కోసం ఏవిధంగా పనిచేస్తుంది.అని క్లుప్తముగా తెలియజేశారు. కంపెనీ యొక ముఖ్య ఉద్దేశం రైతులకు, వైరస్ ను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకాలను అందించడమే ముఖ్య ఉద్దేశం ఉద్దేశమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ సౌత్ ఇండియా(దక్షిణ భారత దేశం డిప్యూటీ జనరల్ మేనేజర్ ) దత్తాత్రేయ ధుమాల్ కంపెనీ ప్రతినిధి కరుణ సాగర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల,సిద్దిపేట జిల్లాలోని రైతులు డీలరు పాల్గొనడం జరిగింది.

