మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్
ఏన్కూరు మండల కేంద్రంలోని జంగాల బజార్ ప్రాంతంలో మంగళవారం ఉదయం యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన సగ్గుర్తి రాజశేఖర్ తన నివాసంలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనపై ఎస్సై సంధ్య దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

