మన ప్రగతి న్యూస్/హనుమకొండ జిల్లా :
ప్రతిభ కు ప్రతిబింబం ఎర్రగట్టుగుట్ట వద్ద గల శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాల అని కరస్పాండెంట్ కె. సదానందం అన్నారు. మంగళవారం కాలేజ్ డే లో భాగంగా.. ముందస్తుగా విద్యార్థులకు ముగ్గుల పోటీల నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి ప్రతిభను ఉపయోగించి వేసిన ముగ్గులు విభిన్న అంశాలను ప్రతిబింబించేలా ఉన్నాయి. ముఖ్యంగా బీకాం ఫైనల్ ఇయర్ విద్యా ర్థులు వైష్ణవి, తేజస్విని పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది పడాల్సివస్తుందో తెలియజేసే ముగ్గు పలువురిని ఆలోచించే విధంగా ఉంది. జూనియర్స్ అనూష, అంకిత లు మొబైల్ ఫోన్ ను అతిగా వాడడం వలన కలిగే పరిణామాలపై, వేసిన ముగ్గు నేటి సమాజంలో విద్యార్థులు సోషల్ మీడి యా ప్రభావంతో ఇలా తమ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారో తెలియ పరుస్తూ చాలా చక్కగా ముగ్గుల రూపం లో వివరించారు. లక్ష్మి ,లహరి స్పందన లు పండుగల యొక్క విశిష్టత తెలియ పరిచే ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ రాజు, డైరెక్టర్ శివ, అధ్యాపకులు సంపత్, మహమ్మద్ జమాలుద్దీన్, రమేష్, నాగరాజు, ప్రకాష్ రెడ్డి, రాకేష్, మౌనిక, సుమలత, లింగా రెడ్డి, కిరణ్, తిరుపతి, కృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



