Breaking News

రేగుపండ్ల కోసం వెళ్లి బావిలో పడి బాలుడు మృతి

మన ప్రగతి న్యూస్/ వీణవంక:

వీణవంక వ్యవసాయ బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలంలోని మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఈర్నాల రాజు 12 మంగళవారం రేగు పండ్ల కోసం భావి దరిపై ఉన్న పండ్లు తెంపుతున్న సమయంలో కాలుజారి బావిలో పడ్డాడు. బాలుడిని వెతుకుతున్న క్రమంలో బావి దగ్గర విడిచిపెట్టిన చెప్పులను గుర్తుపట్టగా, బుధవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీయడం జరిగిందని తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన సేవలకు వాట్సాప్ చాట్‌బోట్