మన ప్రగతి న్యూస్/వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన వివిధ సేవల వివరాలను భక్తులు ఇకపై వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా సులభంగా పొందవచ్చని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. “సర్వీసెస్ ఇన్ జస్ట్ ఎ ఫ్యూ క్లిక్స్” అనే సందేశంతో భక్తులకు అవసరమైన సమాచారం, సేవలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె బుధవారం వెల్లడించారు.భక్తులు 8736936969 నంబర్‌కు వాట్సాప్‌లో “హాయ్’ అని మెసేజ్ పంపితే దర్శనాలు, సేవలు, టికెట్ల వివరాలు తదితర సమాచారాన్ని చాట్‌బోట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ డిజిటల్ సదుపాయం ద్వారా భక్తులకు సమయం ఆదా కావడంతో పాటు, ఆలయ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందనున్నాయని పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం చేపట్టిన ఈ డిజిటల్ చర్యను సద్వినియోగం చేసుకోవాలని ఈవో రమాదేవి కోరారు

