మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం తాడికల్ పీఏసీఎస్ ఎరువుల గోదాం వద్దకు భారీ ఎత్తున యూరియా కోసం వచ్చిన రైతులు యూరియా లేదనడంతో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై నిలబడి నిరసన తెలిపారు. పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులు,ప్రజా ప్రతినిధులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా అందించాలని వారు డిమాండ్ చేశారు.జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మిని మన ప్రగతి ప్రతినిధి వివరణ కోరగా ఈరోజు సాయంత్రం వరకు తాడికల్ పీఏసీఎస్ ఎరువుల గోదాం కు మరో 20 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు.జాతీయ రహదారిపై నిరసన తెలుపడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉన్నత అధికారులతో మాట్లాడి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.ఈ కార్యక్రమంలో తాడికల్ ఉపసర్పంచ్ వెంగళ ప్రవీణ్,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్,మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు,రైతులు పాల్గొన్నారు.

