వల్లంపట్ల గ్రామంలో ట్రాక్టర్ల హావ – గ్రామస్తుల ఆందోళన
మన ప్రగతి న్యూస్/ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో ఇసుక తరలింపు ట్రాక్టర్ల ఓవర్ స్పీడ్ కారణంగా కోతులు మృతి చెందిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామం గుండా వేగంగా దూసుకెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు కోతులను ఢీకొనడంతో అక్కడికక్కడే అవి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుండటంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు నియంత్రణ లేకుండా వాహనాలు నడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన వారు, ఇసుక ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించాలని, చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.గ్రామంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


