Breaking News

మహాశివరాత్రి జాతర సందర్భంగా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ

_: భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ,పార్కింగ్ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి…

_ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

మన ప్రగతి న్యూస్ /
సిరిసిల్ల జిల్లా స్టాపర్:

అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు

మహాశివరాత్రి జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
భీమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి జాతర సందర్భంగా స్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు స్వామి వారి దర్శనం సులభంగా, ప్రశాంతంగా జరిగేలా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఈనెల 14, 15, 16 తేదీల్లో జరుగు మహా శివరాత్రి జాతరను విజయవంతం చేయడానికి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని సూచించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంతో పాటు, బడిపోచమ్మ ఆలయం,నాంపెళ్లి ఆలయం,అగ్రహారం ఆలయల వద్ద భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని తెలిపారు.జాతరకు భారీగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ,పార్కింగ్ ఏర్పాట్లు,క్యూలైన్ల నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ నిఘా వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు,తప్పిపోయిన వారికోసం సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతర ప్రాంగణంలో అనుమానాస్పద వ్యక్తులు,వస్తువులపై నిఘా పెంచాలని, ప్రజలకు సూచనలు చేస్తూ లౌడ్‌స్పీకర్ల ద్వారా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం ఫైర్, మెడికల్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
జాతర బందోబస్తు విధుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుండి వచ్చే పోలీస్ అధికారులు,సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.విధులు నిర్వర్తించే సిబ్బందికి విశ్రాంతి తీసుకునేందుకు అనుకూలమైన వసతి గృహాలు,తాగునీరు ,పారిశుధ్య సౌకర్యాలు,భోజన ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జాతర సమయంలో పోలీస్ అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణంలో దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈసమావేశంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్ లు వీరప్రసాద్,కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధుకర్, రవి, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు పాల్గొన్నారు.