Breaking News

స్వామి పల్లకి సేవలో పాల్గొన్న భక్తులు

స్వామి వారిని కల్యాణం లో పాల్గొన్న చైర్మన్ దంపతులు

కన్నుల పండుగగా శ్రీ లింగ బసవేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు

బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం శ్రీ లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత రెండు రోజులుగా దేవాదాయశాఖ, అభివృద్ధి కమిటీ చైర్మన్ సందిగారి బసవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి శ్రీ లింగ బసవేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అర్చకులు యాలమంచి రాజశేఖర్ శర్మ, ఆలయ పూజారులు జేర్పుల రాంసింగ్, పుణ్య సింగ్ సమక్షంలో కన్నుల పండుగగా జరిగింది. భక్తులు సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి స్వామి వారి కల్యాణం నిర్వహించారు. గురువారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవా తో ప్రారంభంమై స్వామి వారి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. గిరిజన భక్తుల కోసం చిన్నారుల చేత కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున జరగనున్న స్వామి వారి అగ్ని గుండం ప్రవేశానికి పూజ కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నరేందర్ రెడ్డి,ధర్మకర్తలు ఆలేటి బలరాం,నడికుడి వెంకటేశ్,ఆల్వా గొపాల్ రెడ్డి, సుజాత,వంటల శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ బొమ్మగోని బసవయ్య,ఆలయ మాజీ చైర్మన్లు యర్రబోతు శ్రీనివాస్ రావు,ఆల్వ వీరరెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆల్వ రామకృష్ణారెడ్డి, వార్డు సభ్యులు ఆల్వ లింగారెడ్డి,నాయకులు ఆలేటి రామ్ కొండల్, కుంభం సుభాష్ గౌడ్, ఎలిమినేటి కిషోర్ రెడ్డి, సందిగారి చందు తదితరులు పాల్గొన్నారు.