_ ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్..
మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్:
సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల సినారె కళామందిరంలో మాక్ కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం చేయగా, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. వేములవాడ సినారె కళామందిరంలో మాక్ కౌంటింగ్ ప్రక్రియను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో సినారె కళామందిరాల్లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచామని, ఇప్పటికే ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి ఏర్పాట్లు పరిశీలించామని వివరించారు.శుక్రవారం ఉదయం 08.00 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారని వివరించారు. ఒక్కో వార్డుకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, మూడు టేబుల్ లకు కలిపి ఒక ఆర్ఓ, ఏఆర్ఓ ఉంటారని వెల్లడించారు. సిరిసిల్లలో మొత్తం 39 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 78 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించామని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వేములవాడ లో మొత్తం 28 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 56 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించామని తెలిపారు. అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు గెజిటెడ్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. పరిశీలనలో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, ఎన్నికల విభాగం అధికారులు శ్రీనివాసాచారి, మీర్జా ఫసహత్ అలీ బేగ్, అన్సార్ తదితరులు పాల్గొన్నారు.

