నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
నర్సంపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు అన్నారు. నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా మాట్లాడారు. 2.46 కోట్లతో నిర్మించిన ఈ సబ్ స్టేషన్ నేడు ప్రారభించూకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా కొండాపూర్, అసరవెల్లి, మురళీనగర్, గణేశనగర్ లో విద్యుత్ సరఫరా మరింత మెరుగు పడుతుందని అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ పాలాయి శ్రీనివాస్,వైస్ చైర్మన్ హరిబాబు,నర్సంపేట విద్యుత్ డీఈఈ తిరుపతి, కన్స్ట్రక్షన్ డీఈఈ హార్జీ, నల్లబెల్లి తహసిల్దార్ ముప్పుకృష్ణ , కొండాపూర్ సర్పంచ్ లలిత సురేష్,ప్రజా ప్రతినిధులు మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


