Breaking News

లారీ ఢీకొని వ్యక్తి మృతి

శనిగరం గ్రామంలో విషాదఛాయలు

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

మేయర్ మూడ్ గణేష్’కు ఘన సన్మానం

మండలంలోని శనిగరం గ్రామంలో నేషనల్ హైవే 365 జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ తాకి ఓ వ్యక్తి మృతి చెందాడు. అతను శనిగరం గ్రామానికి చెందిన బసవరాజుల కుమారస్వామి (65) అని స్థానికులు గుర్తించారు. మల్లంపల్లి నుండి నర్సంపేటకు వెళ్లే లారీ ఢీ కొట్టింది. అతని తలభాగానికి బాగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటన విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో శనిగరం గ్రామంలో తీవ్ర విషాద వాతావరణ నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుని తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.