మన ప్రగతి న్యూస్ /సంగెం :
సంగెం రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య మంగళవారం అర్ధరాత్రి 11:30 నిమిషాలకు సమయంలో గుర్తు తెలియని పురుషుడు 25 సంవత్సరాల వయసున్న యువకుడు చింతలపల్లి ఏలూగురు రంగంపేట రైల్వే స్టేషన్ల మధ్య డౌన్ లైన్ పై వెళ్ళుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడి కుడి పక్క ఛాతి పైన పుట్టుమచ్చ ఎడమ పక్కన చేతిపై ఆనంద్ అనే పేరు పచ్చబొట్టు ఉన్నది మృతుడి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం , మార్చరికి తరలించి,వరంగల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

