Breaking News

యోగ సర్టిఫికేట్ కోర్స్ కు దరఖాస్తుల ఆహ్వానం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

యోగ డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్ లో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యోగ ఫర్ హ్యాపీ లివింగ్ అకాడమీ ఫౌండర్, యోగా చార్యులు ఆంజనేయులు, డైరెక్టర్ మహేష్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ పదవ తరగతి,ఇంటర్/డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్స్ లకి అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకి ఆన్లైన్/ఆఫ్ లైన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కాకతీయ విశ్వవిద్యాలయం (సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్) ద్వారా ప్రామాణిక సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో గల ఆఫీస్ చిరునామా బాసాని హాల్,సాయి సేవా ట్రస్ట్, పోలీస్ కాలనీ,వడ్డేపల్లి వివరాలకు సెల్ నెంబర్ 9553489862,
9912640919 లను సంప్రదించాలని కోరారు.

మేయర్ మూడ్ గణేష్’కు ఘన సన్మానం