Breaking News

గుడుంబా దందాపై వీణవంక పోలీసులు ఉక్కుపాదం

గుడుంబా వ్యాపారులకు  చివరి హెచ్చరిక

వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి

మన ప్రగతి న్యూస్ /వీణవంక:

మేయర్ మూడ్ గణేష్’కు ఘన సన్మానం

వీణవంక మండలం చల్లూరు గ్రామంలో అక్రమ గుడుంబా దందాపై వీణవంక పోలీసులు ఉక్కుపాదం మోపారు. గ్రామ పరిధిలో కఠిన తనిఖీలు నిర్వహిస్తు న్న సమయంలో, కరీంనగర్ నుండి జమ్మికుంట రేపు వెళ్తున్న  టీజీఎస్‌ఆర్‌టీసీ Ap15z0087 బస్సులో సోదాలు చేస్తుండగా , అనుమానాస్పదంగా కనిపించి న ఇద్దరు మహిళలు  పులపు రజిత, బోదాసు నాగేశ్వరి అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడ్డ వారిని విచారించగా,చల్లూరు గుట్ట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గుడుంబా స్థావరాలు నడుస్తున్నాయని ఒప్పుకున్నారు. సమాచారం ఆధారంగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  గుట్ట ప్రాంతాన్ని ముట్టడి చేసి గుడుంబా స్థావరాల పై  దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో తయారీ సామగ్రి ధ్వంసం చేసి, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాకు ప్రధాన సూత్రధారి బోదాసు సంపత్ పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల  ఆరోగ్యాలతో , ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు చేసిన వారినీ కఠినంగా శిక్షిస్తామని అన్నారు. గుడుంబా వ్యాపారులకు ఇది చివరి హెచ్చరికగా భావించాలనీ, సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియ జేయాలని ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు.