మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
రంగారెడ్డి జిల్లా కుట్లూరు ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ బెట్టింగ్‌కు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సీఎంఓ అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన రాయబండి సూర్య ప్రకాష్‌ను ”రుత్విక్ సాయి, వేములవాడ ఏఎస్పీ” అరెస్ట్ చేసినట్లు తెలిపారు.నిందితుడు సూర్య ప్రకాష్ రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ మండలంకు చెందిన కుంట్లూర్ ప్రాంత వాసిగా గుర్తించారు. గతంలో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.సీఎంఓ అధికారిగా పరిచయం చేసుకుని వివిధ జిల్లాల్లో పలువురు ప్రభుత్వ అధికారులను మోసం చేసినట్లు విచారణలో తేలిందని ఏఎస్పీ తెలిపారు. సూర్య ప్రకాష్‌పై పలు జిల్లాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు స్పష్టం చేశారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

