Breaking News

జూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి..

  • ఏడుగురు వ్యక్తుల అరెస్ట్..
  • 3,93,820 రూపాయల నగదు స్వాధీనం..

మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:

సిద్దిపేట కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం,గౌరారం పోలీసులు ఆదివారం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామంలో ఆకస్మిక దాడి నిర్వ హించింది.గ్రామానికి చెందిన పిట్ల మధు ఇంట్లో అక్రమంగా హెడ్ అండ్ టెయిల్స్ (కాయిన్ టాసింగ్) జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడిలో నిందితుల నుండి భారీగా నగదు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఆస్తుల నగదు.రూ.3,93,820, మొబైల్ ఫోన్లు 03 వాహనం ఒక బాలెనో కారు (నెంబర్: TS07GM3348) నిందితులు పిట్ల మధు (33) నివాసం మైలారం (ఇంటి యజమాని నిర్వాహకుడు) పెట్టరి సిద్దిరాములు (36) దామరకుంట, వెల్దుర్తి మండలం, మెదక్ జిల్లా పెంజర్ల రాజేంద్ర ప్రసాద్ (37) నివాసం దబీల్‌పూర్, మేడ్చల్ జిల్లా.పోకల స్వామి (32) నివాసం భరణ్‌పూర్, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా.వడ్ల మహేందర్ (46) అల్లాపూర్, తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా. భక్తుల యాదగౌడ్ (35), నివాసం కాజిపేట,కోవాలిపల్లి మండలం,మెదక్ జిల్లా.బొరెడ్డి దామోదర్ రెడ్డి (46) లింగాయపల్లి, కామారెడ్డి జిల్లా.పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గౌరారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. మీ ప్రాంతంలో ఏదైనా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే, వెంటనే 8712667445, 8712667446, 8712667447 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ తెలిపారు .

మొలంగూర్ పూజారి ఆత్మహత్యాయత్నం!